Sunday, December 22, 2024

నేడే దాయాదుల సూపర్ పోరు

- Advertisement -
- Advertisement -
ఆసియా కప్‌లో మరోసారి తలపడనున్న భారత్‌-పాక్
వర్షమొస్తే రిజర్వ్ డే

కొలంబో : ఆసియా కప్‌లో భాగంగా ఆదివా రం జరిగే సూపర్4 సమరానికి చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్‌లు సిద్ధమయ్యా యి. పాకిస్థాన్ ఇప్పటికే సూపర్4లో ఓ విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన పాక్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఇక భారత్‌కు సూపర్4లో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. ఇంతకు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యింది. దీంతో ఈసారి జరిగే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్నాయి. అయితే లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా రాణి ంచారు. ముఖ్యంగా షాహిన్ అఫ్రిది అద్భుత బౌలింగ్‌తో భారత బ్యాటర్లను హడలెత్తించాడు. ఈసారి కూడా అతని నుంచి టీమిండియా ఆటగాళ్లకు ప్రమాదం పొంచి ఉంది. భారత్‌తో పోల్చితే పాకిస్థాన్ బౌలింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లోనూ దాయాది బాగానే ఉందని చెప్పాలి. బాబర్ ఆజమ్ ఫామ్‌లో ఉండడం జట్టుకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. రిజ్వాన్, ఫకర్ జమాన్, ఆఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమామ్ ఉల్ హక్, షాదాబ్ ఖాన్‌లతో పాక్ బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అంతేగాక షాహిన్ అఫ్రిది, రవూఫ్, నసీమ్ షా, నవాజ్, హారిస్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో పాక్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
సవాల్ వంటిదే..
మరోవైపు చిరకాల ప్రత్యర్థితో జరిగే పోరు టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. పటిష్టమైన బౌలింగ్ లైనప్ కలిగిన పాక్‌ను ఎదుర్కొవాలంటే భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించక తప్పదు. లీగ్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమయ్యా రు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు జట్టుకు శుభారంభం అందించలేక పోయారు. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా నిరాశ పరిచాడు. శ్రేయస్ అయ్యర్ కూడా సత్తా చాటలేక పోయాడు. అయితే యువ సంచలనం ఇషాన్ కిషన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యలు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇక కీలకమైన ఈ మ్యాచ్‌లో రోహిత్, గిల్, కోహ్లి, అయ్యర్ తదితరులు మెరుగ్గా రాణించక తప్పదు. కాగా, బౌలి ంగ్‌లో మాత్రం భారత్ బలంగానే ఉంది. బుమ్రా చేరికతో ఈ విభాగం మరింత బలోపేతంగా తయారైంది. షమీ, సిరా జ్, జడేజా, కుల్దీప్, అక్ష ర్ తదితరులతో భారత బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా రాణిస్తే ఈ మ్యాచ్ లో దాయాదిని ఓడించడం టీమిండియాకు కష్టమేమీ కాదని చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News