Monday, December 23, 2024

నేడు ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు

- Advertisement -
- Advertisement -

కాశ్మీర్ లోయలో కట్టుదిట్టమైన భద్రత
సుప్రీం జడ్జిమెంట్‌పై సర్వత్రా ఉత్కంఠ

శ్రీనగర్: కశ్మీర్‌కు సంబంధించిన అత్యంత కీలకమైన రా జ్యాంగ 370వ అధికరణ రద్దుపై సోమవారం (నేడు) సుప్రీంకోర్టు కీలక తీర్పువెలువరిస్తుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో ప్రతిపక్ష కూటమి గుప్కార్ స్పందించింది. తీ ర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ఆదివారం ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్వపు జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ఉంటూ వచ్చిన ప్రత్యేక హోదాను సంబంధిత ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ , రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్‌గా విభజి స్తూ కేంద్రంలోని మోడీ సారధ్యపు ఎన్‌డిఎ ప్రభుత్వం 2019 సంవత్సరంలో సంచలనాత్మక నిర్ణయం తీసుకుం ది. దీనిపై పలు ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అధికరణ ర ద్దు రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందా? అనే విషయంపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడుతుంది. ఈ ఆర్టికల్ పునరుద్ధరణకు వీలు కల్పించే తీర్పు వెలువడుతుందని గుప్కార్ భావిస్తోంది. ఈ కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి ఇతర విపక్షాలు ఉన్నాయి. తీర్పు నేపథ్యంలో పరిణామాలను ఎదుర్కొనేందుకు జమ్మూ కశ్మీర్ అంతటా విస్తృతస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.
తీర్పు ఎటువంటిదైనా గౌరవించాలి : బిజెపి
సుప్రీంకోర్టు తీర్పుపై ఏ పార్టీ కూడా రాజకీయాలకు దిగవద్దని, తీర్పు ఎటువంటిదైనా అంతా గౌరవించి తీరాల్సిందేనని బిజెపి స్పష్టం చేసింది. రాజ్యాంగ చెల్లుబాటు విషయంపై సుప్రీంకోర్టు తీర్పు కూలంకుష విచారణ తరువాత వెలువడుతుంది. దీనిని మన్నించాలని బిజెపి తెలిపింది. ఆర్టికల్ రద్దు బిజెపి ప్రధాన అ జెండాగా నిలిచింది. ఎన్నికల మేనిఫెస్టోలలో దీనిని ప్రస్తావిస్తూ వస్తున్నారు.తీర్పు తరువాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ప్రతిపక్షాల వాదనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క నెత్తుటి బొట్టు చిందరాదని అధికారులకు సూచించారు.
చట్టాన్ని గౌరవిస్తాం.. న్యాయానికి పోరాడుతాం : ఒమర్
సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో తమ పార్టీ శాం తి భద్రతల విచ్ఛిన్నాని కి పాల్పడేది లేదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సిఎం ఒమర్ అ బ్దుల్లా తెలిపారు. తమకు ప్రతికూలంగా తీర్పు వచ్చి నా దీనిపై తాము ప్రతిచర్య కు దిగేది లేదని, చట్టప్రకారం ముందుకు వెళ్లుతామని చెప్పారు. మాజీ సిఎం అయిన పిడిపి అధినేత్రి మె హబూబా ముఫ్తీ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య అక్రమం అని సుప్రీంకోర్టు తన తీర్పుతో స్పష్టం చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరో మాజీ సి ఎం గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ ప్రజల పక్షాన, వారి అభిప్రాయాలకు అనుగుణంగానే తీర్పు వెలువడుతుందని నమ్ముతున్నట్లు స్పందించారు. తీర్పు నేపథ్యం లో కట్టుదిట్టమైన రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. సామాజిక మాధ్యమాల తీరు తెన్నులను గమనిస్తున్నట్లు, సునిశిత ప్రాంతాలలో బందొబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. లోయలో పూర్తి స్థా యిలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కశ్మీర్ జోన్ ఐజి వికె బిర్ధి తెలిపారు. పూర్వాపరాలను విశ్లేషించుకుని తగు విధంగా చర్యలు తీసుకుంటారని వివరించారు. రోజువారి విచారణ ప్రక్రియను సెప్టెంబర్ 5న ముగించిన తరువాత ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆగస్టు రెండవ తేదీన తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది. ఇప్పుడు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరిస్తుంది. ఈ బెంచ్‌లో న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్ , సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు. 370 ఆర్టికల్ రద్దును సవాలు చేస్తూ తొలి పిటిషన్‌ను న్యాయవాదిఇ ఎంఎల్ శర్మ దాఖలు చేశారు. తరువాత నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున కూడా మరో ప్రదాన పిటిషన్ దాఖలు అయింది. మరికొన్ని పిటిషన్లు కూడా విచారణకు స్వీకరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News