Wednesday, January 22, 2025

నేడు నియోజకవర్గ స్థాయిలో సంక్షేమ సంబురాలు

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ అమోయ్‌కుమార్

మేడ్చల్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం జిల్లాలో సంక్షేమ సంబురాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలలో ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ లబ్ద్ధిదారులు పాల్గొంటారని, ఈ మేరకు సభలు, సమావేశాలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

సంక్షేమ సంబురాలలో రెండో విడత గొర్రెల పంపిణీ, అవకాశం ఉన్న చోట ఇంటి పట్టాల పంపిణీ, బిసి కుల వృత్తుల వారికి ఆర్ధిక సహాయం, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మంత్రి చామకూర మల్లారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జరిగే సంక్షేమ సంబురాలలో పాల్గొంటారని కలెక్టర్ అన్నారు.

మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం మల్కాజిగిరిలోని బాలాజీ గార్డెన్స్‌లో, పటేల్ నగర్‌లో, కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కూకట్‌పల్లి ఎస్‌కెఆర్ గార్డెన్స్, ఎన్‌హెచ్ 65 మెట్రో ఎదురుగా, ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ రామాంతాపూర్ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్‌లో, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బహుదర్‌పల్లిలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్‌లో సంక్షేమ సంబురాలు జరుగుతాయని అన్నారు. సంక్షేమ సంబురాలలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News