Wednesday, January 22, 2025

బోణీ కొట్టేదెవరో?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వరుస విజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్, ఢిల్యీ క్యాపిటల్స్ జట్లకు మంగళవారం జరిగే మ్యాచ్ కీలకంగా మారింది. ఇప్పటి వరకు ఇరు జట్లు ఈ సీజన్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేక పోయాయి. ముంబై ఆడిన రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఢిల్లీ ముచ్చటగా మూడింటిలో ఓడి హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. ఇలాంటి స్థితిలో మంగళవారం ఢిల్లీ వేదికగా జరిగే మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా తయారైంది. రెండు జట్లు కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమయ్యాయి. రెండు జట్లను కూడా బ్యాటింగ్, బౌలింగ్ సమస్య వెంటాడుతోంది. ఢిల్లీ జట్టులో ఒక్క కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. యువ ఓపెనర్ పృథ్వీషా పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ పృథ్వీషా తేలిపోయాడు. పృథ్వీషా వైఫల్యం ఢిల్లీకి ప్రతికూలంగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన పృథ్వీషా చెలరేగితే ఢిల్లీకి తిరుగే ఉండదు. అయితే షా మాత్రం తన బ్యాటింగ్ తీరును మెరుగు పరుచుకోవడంలో విఫలమవుతున్నాడు. ఈసారి కూడా విఫలమైతే అతనికి రానున్న మ్యాచుల్లో కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆ జోరు కనిపించడం లేదు..

మరోవైపు ఢిల్లీ కెప్టెన్ వార్నర్ నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. అతని బ్యాటింగ్‌లో మునుపటి జోష్ కనిపించడం లేదు. ఒకప్పుడూ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఐపిఎల్‌లో పెను ప్రకంపనలు సృష్టించిన వార్నర్ ఈసారి మాత్రం ఆ స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోతున్నాడు. రానున్న మ్యాచుల్లోనైనా వార్నర్ తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ఐపిఎల్‌లో అదరగొడతారని భావించిన మనీష్ పాండే, రిలీ రొసో, రొమాన్ పొవెల్, అభిషేక్ పొరెల్ తదితరులు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు. కిందటి మ్యాచ్‌లో మనీష్ పాండే ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఓపెనర్ పృథ్వీషా కూడా సున్నాకే ఔటయ్యాడు. రొసో, అక్షర్ పటేల, పొవెల్, పొరెల్ తదితరులు కనీసం ఈసారైనా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. లేకుంటే ఢిల్లీకి మరో ఓటమి ఖాయం.

ఈసారైనా?

ఇదిలావుంటే మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కూడా ఈ సీజన్‌లో వరుస ఓటములతో నిరాశ పరుస్తోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముంబైకి ఓటమి తప్పలేదు. కెప్టెన్ రోహిత్‌తో సహా ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నారు. కిందటి మ్యాచ్‌లో రోహిత్, ఇషాన్‌లు ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినా ఫలితం లేకంపడా పోయింది. ఇద్దరు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో జట్టుకు కష్టాలు తప్పలేదు. భారీ ఆశలు పెట్టుకున్న గ్రీన్, సూర్యకుమార్‌లు వరుస వైఫల్యాలు చవిచూస్తున్నారు. వీరి వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న సూర్యకుమార్ ఐపిఎల్‌లోనూ నిరాశ పరుస్తున్నాడు. రానున్న రోజుల్లోనైనా సూర్యకుమార్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సి ఉంటుంది. తెలుగు కుర్రాడు తిలక్‌వర్మ తొలి మ్యాచ్‌లో బాగానే ఆడాడు. అయితే కిందటి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. బౌలింగ్‌లోనూ ముంబైకి ఇబ్బందులు తప్పడం లేదు. బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. బెహ్రాన్‌డార్ఫ్, అర్షద్ ఖాన్, గ్రీన్, పియూష్ చావ్లా తదితరులు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలహీనంగా మారిన ముంబైకి ఈ సీజన్ ఒక సవాల్‌గా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో మెరుగైన ఫలితాలతో ముందుకు సాగడం ముంబైకి కష్టమేనని చెప్పక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News