Monday, December 23, 2024

సోమవారం రాశి ఫలాలు(16-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. విందు, వినోదాలలో ఉత్సాహంగా పాలుపంచుకుంటారు, స్థిరాస్థి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో ఎదురైన చిక్కులు తొలుగుతాయి.

వృషభం: పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి- వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

మిథునం: పనుల్లో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధనం అందుతుంది. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరుల నుండి కీలక సమాచారం. ఇంటాబయట మీదే పైచేయిగా ఉంటుంది.

కర్కాటకం: వృత్తి-ఉద్యోగ వ్యవహారాలలో అవరోధాలు ఏర్పడినా అధిగమిస్తారు. కోపతాపాలకు, వివాదాలకి దూరంగా ఉండండి. బంధువులని కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

సింహం: శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. బంధువులతో ఏర్పడిన ఆర్ధిక పరమైనవివాదాలు సమసిపోతాయి వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకి, కార్మికులకి పదోన్నతలు లభిస్తాయి.

కన్య: ప్రముఖల నుండి ఊహించని అతిధి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలుగును. సన్నిహితులతో సఖ్యత అవసరం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

తుల: భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన మనస్పర్ధలు మరచిపోయి ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

వృశ్చికం : నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఎదురైన ఆటంకాలు మిత్రుల సాయంతో తొలగించు కుంటారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. సమాచార విషయాలు గోప్యత అవసరం.

ధనుస్సు: విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, బోనస్ లు పొందుతారు. అగ్రజుల  నుండి విలువైన సమాచారం అందుతుంది.

మకరం : నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ మార్పుకోసం చేసే ప్రయత్నాలు సానుకూల పడే అవకాశాలు ఉంటాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. చిరకాల మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఇంటాబయటా అనుకూలంగా వుండును. సేవకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

కుంభం: ఆర్థిక వ్యవహారాలలో స్వల్బ లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు మధ్యవర్తుల ద్వారా పరిష్కారం చేసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తులాభం గోచరిస్తున్నది

మీనం: భవిష్యత్తుకి సంబందించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు. బంధువుల నుండి వచ్చిన  సమాచారం మిమ్మల్ని అమితంగా బాధిస్తుంది. ఆరోగ్య సమన్యల నుండి బయటపడతారు. కార్యాలయంలో సిబ్బంది పనిపట్ల సానుకూలత ఉంటుంది. ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News