Sunday, December 22, 2024

బుధవారం రాశి ఫలాలు(18-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. కొంత వరకు ఋణాలు చేస్తారు. మానసిక ఆందోళనలు అధికమవుతాయి. తగాదాలకు దూరంగా వుండండి. జీవితభాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు.

వృషభ :  వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త వ్యక్తులు, మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు నాంది పలుకుతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. ఆరోగ్య పరంగా కొంత సానుకూలత ఉంటుంది.

మిథునం: బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు తొలుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. తోటివారితో సఖ్యతగా ఉంటారు. మెప్పుని పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ, సహకారాలు అందుతాయి.

కర్కాటకం: దీర్ధకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. అనుకోని వ్యక్తుల నుండి ఆహ్వానాలు  అందుకొంటారు. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.

సింహం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం సిద్దిస్తుంది.

కన్య : మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహనయోగాలు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన సమయం.

తుల: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకి  డబ్బు అందుతుంది. వివాదాలకి, కోపతాపాలకి దూరంగా ఉండండి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. విద్యార్దిని విద్యార్ధులకు పరీక్షా కాలం. విద్యార్ధులు శ్రద్ద పెట్టి చదవాలి,

వృశ్చికం : బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్తు, వాహనాలు  కొనుగోలు చేస్తారు. ఆర్ధికాభివృద్ధి ఉంటుంది. జీవితభాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

ధనుస్సు: భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అరుదైన ఆహ్వనాలు అందుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. పాతమిత్రుల కలయిక మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఉద్యోగస్తులకి  కీలక సమయం అని చెప్పవచ్చు.

మకరం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన వాగ్వివాదాలు సమసిపోతాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. దైవ చింతన పెంపొందించుకొండి. శుభ ఫలితాలు ఉంటాయి.

కుంభం: చేపట్టిన పనులు నత్తనడకన పూర్తి చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు.

మీనం: దీర్ధకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆప్తుల నుండి ఆర్థికలాభం పొందుతారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. షేర్లు, క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వాహన ప్రయాణంలో చిన్నపాటి జాగ్రత్తలు అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News