Wednesday, January 22, 2025

శనివారం రాశి ఫలాలు(24-08-24)

- Advertisement -
- Advertisement -

మేషం: వృత్తి ఉద్యోగాలపరంగా సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. కీలకమని భావించిన అంశాలలో తొందరపాటు చేయకూడదు అని నిర్ణయించుకుంటారు.

వృషభం: క్రమ శిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి ఉద్యోగాలపరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏర్పడవు. పొదుపు పథకాలకు శ్రీకారం చుడతారు.

మిథునం: మీ శక్తిని పరిశీలించుకోకుండా వాగ్దానాలు చేయడం వలన ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. శుభకార్య ప్రయత్నాలలో ముందడుగు వేయగలుగుతారు.

కర్కాటకం: వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి.

సింహం: ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వైరి వర్గంతో అప్రమత్తంగా మెలగడం మంచిది.

కన్య: రాబడి పెరుగుతుంది. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపార పరంగా అనేక విధాలుగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు.

తుల: వ్యాపారాలను విస్తరిస్తారు. దైవ చింతన కలిగి ఉంటారు. సాహసోపితమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు తగిన విధంగా సన్నద్ధం అవుతారు.

వృశ్చికం: నూతన ఆదాయం మార్గాలను అన్వేషిస్తారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి.

ధనుస్సు: వ్యవహారాలను కొంతవరకు సానుకూల పరచుకోగలుగుతారు. ప్రయాణాలు లాభిస్తాయి.  ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు.

మకరం: వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలమైన బదిలీ లేక ఉన్నతి లభించే సూచనలు ఉన్నాయి. ఓర్పు నేర్పులతో కార్యక్రమాలను పూర్తిచేస్తారు. ప్రజ్ఞా పాట వాళ్లను కనబరుస్తారు.

కుంభం: ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. లిటిగేషన్ వ్యవహారాలు సానుకూల పడతాయి. చాలా కాలంగా అపరిస్కృతంగా ఉన్న సమస్యలు కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి.

మీనం: ప్రమోషన్ విషయంలో సాంకేతికపరమైన లోపాలు చోటు చేసుకుంటాయి. వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
84669 32223, 90141 26121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News