Sunday, December 22, 2024

రాశి ఫలాలు(28-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం: ఎక్కువగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక విలువైన ఆస్తిని కొనుగోలు చేయడానికి సన్నద్ధమవుతారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృషభం: వృత్తి ఉద్యోగాలపరంగా శారీరక మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది.

మిథునం: వ్యాపారంలో నూతన మార్పులు చేయడం కానీ లేక ఒక రంగం నుండి మరొక రంగంలోకి మారడం కానీ సంభవించవచ్చు.

కర్కాటకం: కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం రీత్యా శుభవార్తను వినగలుగుతారు. దుష్ప్రచారాలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల సానుకూల ఫలితాలను సాధిస్తారు.

సింహం: ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది.చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. సహోదర వర్గం వల్ల మేలు జరుగుతుంది. నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు.

కన్య: న్యాయపరమైన చిక్కులలో చిక్కుకున్న మీవారిని రక్షించవలసిన బాధ్యత మీ పైన పడుతుంది. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తారు.

తుల: ఆర్థికంగా పూర్తిస్థాయిలో కాకపోయినా కొంతవరకు ఊరట చెందుతారు. కాలం అనుకూలంగా మారుతున్నట్లుగా భావిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

వృశ్చికం: మీ నిజాయితీని రుజువు చేసుకోగలుగుతారు. వ్యాపార పరంగా లాభాలు రొటేషన్ ల రూపంలో ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి.

ధనుస్సు: పరోపకార బుద్ధిని కలిగి ఉంటారు.శుభకార్యాలు పూర్తి చేయడానికి అధిక ధనాన్ని వెచ్చిస్తారు. చేపట్టిన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు.

మకరం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి.

కుంభం: అన్నింట ఎంతో కొంత లాభ పడగలుగుతారు. మీ ప్రణాళికలు వ్యూహాలు చాలా వరకు ఫలిస్తాయి. మానసిక సౌఖ్యం లోపిస్తుంది. వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు.

మీనం: స్వయంకృతాపరాదులు చోటుచేసుకుంటాయి. న్యాయవాదుల తోటి చర్చలు ఉపయోగకరిస్తాయి. అనుకొని అవకాశాలు లభిస్తాయి. మానసికంగా కొంత ఒత్తిడికి లోనవుతారు.

 

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News