Wednesday, January 22, 2025

రాశీ ఫలాలు(11-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. యత్నకార్యసిద్ధి. ఉద్యోగాలు ఆశాజనకంగా వుంటాయి. ఆహ్వానాలు.

వృషభం: ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు.భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

మిథునం: బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తు కొనుగోలు.

కర్కాటకం: పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్త.

సింహం: నూతన పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. విందు, వినోదాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి.

కన్య: దూరపు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వివాదాల నుండి బయటపడతారు. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. సోదరుల కలయిక.

తుల: పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఉద్యోగాలలో ఎదురైన ఒడిదుడుకులు తీరుతాయి.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. సోదరుల కలయిక.

ధనున్సు: దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. విందు, వినోదాలు. కార్యజయం. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. బంధువుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. వాహన సౌఖ్యం.

మకరం: బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. అనుకోని అవకాశాలు లభిస్తాయి, భూములు క్రయవిక్రయాలు అనుకూలం.

కుంభం: మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సన్నిహితుల నుండి ధనలాభం. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు.

మీనం: సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలలో లాభాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News