Wednesday, January 22, 2025

రాశి ఫలాలు(14-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుండి ధన, వస్తు లాభాలు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. శుభవార్తలు

వృషభం – పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు దక్కించుకొంటారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మిథునం – విద్యార్థులకు అనుకూల ఫలితాలు పొందుతారు. సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు

కర్కాటకం – ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆరోగ్యసమస్యల నుండి బయటపడతారు. సోదరుల కలయిక.

సింహం – నూతన వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు. దీర్ఘ సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. అరుదైన ఆహ్వానాలు.

కన్య – దూరపు బంధువులను కలిసి ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భూ గృహ యోగాలు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. వస్తు లాభం.

తుల – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఇంటా బయటా అనుకూలంగా వుండును. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో స్థానచలనం.

వృశ్చికం – ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు నెమ్మదిగా సాగుతాయి. సోదరుల నుండి ధన లాభం.

ధనున్సు – ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు.

మకరం – పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కుంభం – పనుల్లో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా వుండును. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

మీనం – ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. వస్తు కొనుగోలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News