Sunday, December 22, 2024

శనివారం రాశి ఫలాలు(02-11-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – కార్యాలయంలో మీపై నిష్కారణంగా దృశ్ ప్రచారం చేసే వారికి బదిలీ అవుతుంది. ఇందువల్ల మీకు ఊరట లభిస్తుంది. సాంకేతిక రంగంలోని వారికి ఒడిదుడుకులు సూచిస్తున్నాయి.

వృషభం – మన వాళ్ళని నమ్మి కొంతమందికి పనులు అప్పగించడం వలన చేదు అనుభవాలు ఎదురవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మానసిక సంతోషం లభిస్తుంది.

మిథునం – శుభకార్యాలు ఘనంగా నిర్వహించడం కోసం రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ముఖ్యమైన బాధ్యతలు తీర్చగలిగామని సంతృప్తి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది.

కర్కాటకం – ప్రభుత్వ అధికారుల వల్ల చిక్కులు రావచ్చు జాగ్రత్త వహించండి. జమా, ఖర్చుల వివరాలు అందుకు సంబంధించిన పుస్తకాలు భద్రపరచండి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

సింహం – ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు.

కన్య – దూర బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వ్యతిరేక వాతావరణంలోను అనుకూల ఫలితాలను సాధిస్తారు. సొంత మనుషులు ఆత్మీయులని భావించిన వారి కోసం మీ పరపతిని ఉపయోగించి మరీ సహకరిస్తారు.

తుల – జీవిత సారం ఏమిటి అనే వైద్య ధోరణిని కనబరుస్తారు. ఇందుకు ప్రత్యేక కారణాలు ఉండవు. ప్రత్యర్థుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అయినా నిలబడతారు విదేశీయాన ప్రయత్నాలు సానుకూల పడతాయి.

వృశ్చికం – ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతను ఇస్తారు. చేస్తున్న ప్రయత్నాలలో పురోగతిని సాధిస్తారు. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

ధనుస్సు – శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన విషయాలు గ్రహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలు చర్చిస్తారు.

మకరం – ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది.

కుంభం – సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్తపెట్టబడులకు అనుకూల సమయం. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి.

మీనం – వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. రాజకీయ, కళారంగాలోని వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి. దేవాలయ సందర్శనం చేసుకుంటారు. విదేశీయాన యత్నాలు కలిసి వస్తాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News