Monday, December 23, 2024

నేడు ప్రత్యేక విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రత్యేక విడత సీట్లు బుధవారం కేటాయించనున్నారు. ఇంజనీరింగ్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ఈనెల 17న ప్రారంభం కాగా, 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో మొత్తం 83,766 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 19,049 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. దీని తర్వాత స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News