Friday, November 22, 2024

నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెంట్ వారాంతమైన శుక్రవారం లాభాల్లో ముగిసింది. ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ నేడు పుంజుకున్నాయి. ముఖ్యంగా రిలయన్స్, ఇన్పోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, టిసిఎస్ కంపెనీల షేర్లు మార్కెట్ ను ముందుకు నడిపించాయి. సెన్సెక్స్ 1961.32 పాయింట్లు లేక 2.54 శాతం పెరిగి 79117.11 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 557.35 పాయింట్లు లేక 2.39 శాతం పెరిగి 23907.25 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రధానంగా ఎస్ బిఐఎన్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఐటిసి, టిసిఎస్ లాభపడగా, బజాజ్ ఆటో ప్రధానంగా నష్టపోయింది. డాలరు మారకంతో రూపాయి విలువ 0.04 నష్టపోయి రూ. 84.46 వద్ద ట్రేడయింది. కాగా స్వచ్ఛమైన బంగారం రూ. 893.00 లేక 1.16 శాతం పెరిగి రూ. 77586.00 వద్ద ట్రేడయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News