Monday, January 20, 2025

సోమవారం రాశి ఫలాలు(20-01-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – నూతన వ్యాపార ప్రారంభం కోసం పెట్టుబడులను అన్వేషిస్తారు. నూతనమైన ఫైనాన్షియల్ స్కీమ్స్ లో సభ్యత్వం తీసుకుంటారు. దూరమైన సన్నిహిత వర్గం తిరిగి చేరువవుతారు.

వృషభం –  కార్యాలయంలో పని భారం అధికంగా ఉంటుంది. వ్యాపార ఉన్నతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

మిథునం – అనవసర ఖర్చులు అధికమవుతాయి. ఉన్నతస్థాయి వర్గం వారి అండదండలు లభిస్తాయి. శుభప్రదమైన ప్రసంగాలు చర్చలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి.

కర్కాటకం – ప్రతి విషయము మొదట కొంత నింపాదిగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. మొండిబాకిలు కొంతమేర వసూలు అవుతాయి. విదేశీయాన యత్నాలు కలిసి వస్తాయి.

సింహం – ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకుంటారు. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి లోను కాకుండాఉండటానికి యోగా వంటివి అభ్యసిస్తారు. ఆరోగ్యపరమైన చిక్కులు తప్పకపోవచ్చు.

కన్య – వృత్తి ఉద్యోగాలపరంగా సంతృప్తికరమైన ఫలితాలు. వ్యాపార ఉన్నతికి గాను మీరు అవలంబించే ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబంలో స్వల్పమైన మనస్పర్ధలు ఏర్పడవచ్చు.

తుల – మిత్ర బృందాలను మరింతగా విస్తరింపజేస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులు అవుతారు. పంతానికి పోయి ప్రయోజనాలను వదులుకోవడానికి కూడా సిద్ధపడతారు.

వృశ్చికం – కీలకమైన విషయాల్లో తగిన జాగ్రత్తల అవసరం. ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. కీలక మని భావించిన అంశాలలో తొందరపాటు చేయకూడదు. కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి.

ధనుస్సు – ఆర్థిక విషయాలలో మెలకువలు అవసరం. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి- వ్యాపారాలపరంగా సాధారణ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత హోదా పెంపొందుతుంది.

మకరం –  క్రమబద్ధమైనటువంటి ప్రణాళికలను ఏర్పరచుకొని ఆ దిశగా అడుగులు వేస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రమోషన్ విషయంలో సాంకేతికపరమైన లోపాలు చోటు చేసుకుంటాయి.

కుంభం –  ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు.  వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మెలకువతో వ్యవహరించడం చెప్పదగినది.

మీనం – ఉద్యోగ వ్యాపారాల పరంగా సాధారణంగా ఉంటుంది. ఆర్థిక స్థితి పైన శ్రద్ధ ఎక్కువగా చూపించ వలసి ఉంటుంది.దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు.

సోమేశ్వర శర్మ, 8466932223

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News