Monday, January 20, 2025

నేడు ఇందూరుకు ప్రధాని

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్‌లో మోడీ సభకు ఏర్పాట్లు

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ నేడు తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు. నిజామాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన పట్టణంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఇందూరు జన గర్జన సభ జరగనుంది.

ఈ సభకు ప్రధాని మోడీతో పాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ , బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ పాల్గొననున్నారు. ప్రధాని మోడీ మధ్యాహ్నం 2.10 గంటలకు బీదర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, 2.55 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్‌కు చేరుకుంటారు. 3 గంటల నుంచి 3.55 వరకు వివిధ అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. 3.45 గంటల నుంచి 4.45 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. 4.55 గంటలకు అక్కడి నుంచి మళ్లీ బీదర్ విమానశ్రయానికి చేరుకుని అనంతరం తిరిగి హస్తిన ప్రయాణం కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News