Sunday, January 19, 2025

నేడు, రేపు ఎస్‌ఐ రాత పరీక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 8, 9 తేదీల్లో ఎస్‌ఐ పోస్టులకు తుది రాత పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు సకల ఏర్పాట్లు చేసింది. అయితే 8వ తేదీనే ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరా బాద్ లో పరీక్ష రాసే ఎస్‌ఐ అభ్యర్థులు ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా 2 గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ సూచించారు. మోడీ రానున్న నేపథ్యంలో సికిం ద్రాబాద్ పరిసర పాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ప్రభావం నగరం అంతటా పడే అవకాశం ఉన్నందున అభ్యర్థులు ట్రాఫిక్‌లో ఇరుక్కు పోయే అవకాశం ఉంది. దాదాపు అన్ని రహదారులు బిజీగా ఉండే అవకాశం ఉన్నందున తమ పరీక్షా కేంద్రాలకు 2 గంటల ముందే వెళ్లేలా అభ్య ర్థులు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులకు, ఎస్‌ఐ అభ్యర్థులకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News