Monday, December 23, 2024

నేడు టిఎస్ పాలిసెట్ కౌన్సెలింగ్‌కు ఆఖరి గడువు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్ పాలిసెట్ ఆడ్మిషన్ కౌన్సెలింగ్‌కు నేడు ఆఖరి గడువని ఇప్పటివరకు 460 మంది స్లాట్‌ను బుక్ చేసుకున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్ చెల్లింపుకు నేడు చివరి తేదీని, ఈనెల 10వ తేదీన సర్టిఫికేట్ల పరిశీలన, గ్రూపుల ఎంపికలు ఈనెల 11వ తేదీ వరకు ఉందని, ఇప్పటివరకు 13659 మంది అభ్యర్థులు ఎంపిక చేసుకున్నట్లు అభ్యర్థి వినియోగించే గరిష్ట ఎంపికల సంఖ్య 424 ఉంటుందన్నారు. నోటిఫికేషన్ వివరాలు, హెల్ప్ లైన్ కేంద్రాల జాబితా,కోర్సులు, కౌన్సెలింగ్ విధానం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆమె వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News