నిర్మల్‌ప్రతినిధి : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేటి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొత్త కలెక్టరేట్ భవనంలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల కుటుంబ సభ్యుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత అమరుల స్థూపం, ప్రతిమకు పుష్ఫలతో నివాళ్లర్పించి మౌనం పాటించారు. కలెక్టర్ వరుణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాం బాబు, జిల్లా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ధైర్యంగా పోరాడి ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాల ఫలమే నేడు మనం సాధించుకన్నా తెలంగాణ అని, ఆచార్య జయ శంకర్ సిద్ధాంతిక ఆలోచనలు, మన నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ నాయకత్వం , ప్రతీ ఒక పౌరుడి పోరాట కృషి , అమరుల త్యాగం తెలంగాణ చరిత్రలో ఎప్పటికి మరిపోలేమన్నారు. ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి ఉద్యోగం పొంది వివిధ శాఖలలో పని చేస్తున్నా ఆ కుటుంబ సభ్యులకు ఏ కష్టం వచ్చిన అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డిపిఆర్‌ఓ తిరుమల, డిఆర్‌ఓ లోకేశ్వర్‌రావు, డాక్టర్ ఉప్పు కృష్ణం రాజు, సిబ్బంది ఉన్నారు.