Monday, December 23, 2024

భారత్‌లో పెరుగుతున్న జనాభా ఓ టైమ్‌బాంబ్: తొగాడియా

- Advertisement -
- Advertisement -

రాయిపూర్: దేశంలో పెరుగుతున్న జనాభా పేలనున్న టైమ్ బాంబ్ వంటిదని, ఈ పేలుడును, విపరీతాలను తప్పించడానికి చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని మాజీ విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నేత ప్రవీణ్ తొగాడియా ఆదివారం సూచించారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే ఈ జనాభా నియంత్రణకు, యూనిఫారమ్ సివిల్ కోడ్ (యుసిసి)కు సంబంధించి చట్టాన్ని అమలు లోకి తేవాలని కోరారు. అంతర్రాష్ట్రీయ హిందూ పరిషద్ అధ్యక్షుడైన తొగాడియా రాయిపూర్‌లో బహిరంగ సభకు ముందుగా విలేఖరులతో మాట్లాడారు. మహాసముంద్ జిల్లాలో బస్నా ఏరియాలో ఈ సభ జరుగుతోంది.

జనాభా అతిగా పెరిగి, సమతూకం దెబ్బతింటే పట్టణాలు, గ్రామాల్లో సివిల్ వార్స్‌కు దారి తీస్తాయని హెచ్చరించారు.ఈ విధమైన చట్టం రూపొందించే చర్యలు, యుసిసి, కాశీ, మధురల్లో ఆలయాల నిర్మాణం, హిందువులను రక్షించడమే కాకుండా, వారికి (బీజేపీ) ఓట్లు కూడా పడతాయని వ్యాఖ్యానించారు. భారత దేశం ఇప్పటికే హిందూ రాష్ట్ర అని, హిందూ రాజకీయ రాష్ట్రగా స్థాపించాలన్నదే తాము కోరుకుంటున్నామని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. భారత్ హిందూ ఆధిక్యత కలిగిన దేశమని, హిందువులు దేశంలో ఎక్కడా అభద్రతా భావానికి గురి కాకుండా చూడడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News