Thursday, December 19, 2024

నేటి నుంచి ఎంజిబిఎస్‌లో ఉచిత టాయిలెట్ సదుపాయం

- Advertisement -
- Advertisement -

MGBS TOILETS FREE

 

హైదరాబాద్: నేటి నుంచి మహాత్మా గాంధీ బస్ స్టాండ్(ఎంజిబిఎస్‌)లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉచిత టాయిలెట్ సదుపాయం కల్పించింది. పైలెట్ ప్రాజెక్టు కింద మొదటిసారి ఉచిత టాయిలెట్ సదుపాయాన్ని ఎంజిబిఎస్‌లో చేపట్టారు. టాయిలెట్ మేయింటెనెన్స్‌లో… ప్రైవేటు కాంట్రాక్టు వ్యవస్థకు ఆర్టీసీ యాజమాన్యం స్వస్తి పలికింది. ప్రస్తుతం మేయింటెనెన్స్ వర్కర్స్‌కు ఆర్టీసీ వేతనాలను నేరుగా చెల్లించనుంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని బస్టేషన్లలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. టాయిలెట్స్‌కు వెళ్లే వారు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. సదుపాయం అయితే బాగానే ఉంది. కానీ నిర్వహణ, శుభ్రత ఏ మేరకు ఉంటుందో మరి?….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News