Monday, December 23, 2024

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట టోకరా

- Advertisement -
- Advertisement -

వైరా:గురుకుల పాఠశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఓ మాయలేడి ఉడాయి ంచింది.దీంతో నగదు చెల్లించిన భాదితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన సంఘటన వైరాలో చోటు చేసుకుంది.స్ధానికు లు,పోలీసులు అందించిన సమాచారం ప్రకా రం రెబ్బవరం గ్రామంలోని మహాత్మా జ్యోతి బా పూలే బీసీ వేల్ఫేర్ గురుకుల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న జ్యోతి సుమారు 70 మందికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలలో వసూలు చేసింది.ఉద్యోగం వచ్చిన మెదటి 3సంవత్సరాలు 25వేల సాలరీ, పర్మినెంట్ అయ్యాక 40వేలు జీతం ఇస్తారని ఆశ చూపించటంతో బాధితు లు నమ్మి మోసపోయారు.

నగదు చెల్లించి ఆ రు నెలలు గడుస్తున్న ఉద్యోగాలు రాకపొవటంతో బాధితులు జ్యోతిని పలుమార్లు అడుగుతుండటంతో గత కొన్ని రోజుల క్రితం పరారైన్నట్లు తెలుసుకొని వైరా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News