టోక్యో: మహిళల ఆర్చరీలో దీపికా కుమారి పతకం ఆశలను సజీవంగా ఉంచుకుంది. మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి అసాధారణ ఆటతో ముందుకు దూసుకెళుతోంది. ప్రపంచ నంబర్‌వన్ ఆర్చర్‌గా వెలుగొందుతున్న దీపికా కుమారి టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, టీమ్ విభాగంలో భారత ఆర్చర్లు పేలవమైన ఆటతో నిరాశ పరిచారు. మహిళలు, పురుషుల విభాగంలో భారత్ పతకం రేసు నుంచి వైదొలిగింది. అయితే మహిళల వ్యక్తిగత విభాగంలో మాత్రం దీపికా కుమారి పతకం ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలి నాకౌట్ పోరులో భూటాన్ ను చెందిన కర్మను 60తో చిత్తు చేసింది. పూర్తి ఏకాగ్రతతో ఆడిన దీపిక అలవోక విజయం అందుకుంది. రెండో పోరులో అమెరికాకు చెందిన జెన్నిఫర్ ఫెర్నాండెజ్‌ను ఓడించింది. ఆసక్తికరంగా సాగిన పోరులో దీపికా కుమారి 64తో జయకేతనం ఎగుర వేసింది. ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురు కావడంతో ఒక దశలో దీపిక తీవ్ర ఒత్తిడికి గురైంది. అయితే కీలక దశలో మళ్లీ పుంజుకుని విజ యం సాధించింది.
తరుణ్, జాదవ్ ఇంటికి
మరోవైపు పురుషుల ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ పోరాటం ముగిసింది. వీరిద్దరూ ప్రిక్వార్టర్ దశలోనే ఇంటిదారి పట్టారు. తరుణ్‌దీప్ రాయ్ అద్భుత పోరాట పటిమన కనబరిచినా ఫలితం లేకుండా పోయింది. తొలి మ్యాచ్ లో ఉక్రెయిన్ ఆటగాడు హన్‌బిన్‌పై 64తో విజయం సాధించాడు. అయితే ఇజ్రాయిల్ ఆర్చర్ షానీ ఇటేతో జరిగిన పోరులో ఓటమి పాలయ్యాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో ఇటే 65తో తరుణ్‌ను ఓడించాడు. ఇక ప్రవీణ్ జాదవ్ కూడా పతకం రేసు నుంచి నిష్క్రమించాడు. తొలి పోరులో రష్యా ఆర్చర్, ప్రపంచ నంబర్2 బజరజపోవ్ గాల్సన్‌ను 60 తేడాతో చిత్తుగా ఓడించాడు. తొలి మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన ప్రవీణ్‌కు తర్వాతి మ్యాచ్‌లో చుక్కెదురైంది. ప్రపంచ చాంపియన్ ఎలిన్ బ్రాడీ(అమెరికా)తో జరిగిన పోరులో 60తో పరాజయం పాలయ్యాడు. దీంతో పురుషుల విభాగంలో భారత పోరాటం ముగిసింది.
Tokyo Olympics: Deepika Kumari wins in Archery