జకోవిచ్ కల చెదిరింది..
సెర్బియా యోధుడికి జ్వరేవ్ షాక్
టోక్యో: పురుషుల టెన్నిస్‌లో రారాజుగా వెలుగొందుతున్న ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో చుక్కెదురైంది. కెరీర్‌లో గోల్డెన్ గ్రాండ్‌స్లామ్ సాధించి చరిత్ర సృష్టించాలనే జకోవిచ్ కలలపై జర్మనీ యువ సంచలనం అలెగ్జాండర్ జ్వరేవ్ నీళ్లు చల్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జకోవిచ్‌పై జ్వరేవ్ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలనే జకోవిచ్ కల చెదిరిపోయింది. ఈ ఏడాది ఇప్పటికే వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి జకోవిచ్ జోరుమీదున్నాడు. ఇదే జోరును ఒలింపిక్స్‌లోనూ కనబరచాలని తహతహలాడాడు. అనుకున్నట్టుగానే సెమీస్ వరకు అలవోకగా గెలుస్తూ వచ్చాడు. కానీ కీలకమైన సెమీస్ పోరులో మాత్రం కంగుతిన్నాడు. జర్మనీ స్టార్ జ్వరేవ్ అసాధారణ ఆటతో జకోవిచ్‌ను మట్టి కరిపించి స్వర్ణం పోరుకు దూసుకెళ్లాడు. మూడు సెట్ల సమరంలో జ్వరేవ్ 16, 63, 61 తేడాతో జకోవిచ్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో జకోవిచ్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ అలవోకగా విజయం అందుకున్నాడు. అయితే తర్వాతి రెండు సెట్లలో జ్వరేవ్ జోరును కొనసాగించాడు. వరుసగా రెండింటిలో గెలిచి ఫైనల్‌కు చేరాడు. మరో సెమీఫైనల్లో రష్యా ఆటగాడు కరెన్ కచనోవ్ విజయం సాధించాడు. ఏకపక్షంగా సాగిన పోరులో కచనోవ్ 63, 63తో స్పెయిన్ ఆటగాడు పబ్లో కర్రెనో బుస్టాను ఓడించాడు.
Tokyo Olympics: DJokovic Defeated by Zverev