టోక్యోః ఒలంపిక్స్‌లో భారత క్రీడాకారిణి కమల్‌ప్రీత్ కౌర్ అదరగొట్టింది. శనివారం జరిగిన మహిళల డిస్కస్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌లో కమల్‌ప్రీత్ అద్భుత ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఫైనల్‌కు అర్హత సాధించింది.క్వాలిఫికేషన్‌లో కమల్ ప్రీత్ తొలి ప్రయత్నంలో 60.29 మీటర్లు, రెండో ప్రయత్నంలో 63.97 మీటర్లు, చివరగా మూడో ప్రయత్నంలో 64 మీటర్లు విసిరి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక, అమెరికా క్రీడాకారిణి వలరీ అల్మన్ 66.42 మీటర్లు విసిరి తొలి స్థానంలో నిలిచింది. అయితే, 64మీటర్లు విసరకపోయినా.. మొత్తంగా ఇందులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన 12 మందిని ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. ఆగస్టు 2న జరగనున్న ఫైనల్‌లో 12మంది పోటిపడనున్నారు.
Here's how Kamalpreet Kaur booked her place in the discus throw final. She became just the second #IND woman to reach the final in the event at an #Olympics after Krishna Poonia in 2012pic.twitter.com/u9oKFNiK7m
— Firstpost Sports (@FirstpostSports) July 31, 2021
Cortecy by Firstpost twitter
Tokyo Olympics: Kamalpreet kaur Reached final in Discus