టోక్యో: బాక్సింగ్‌లో పతకాలు సాధించి పెడతారని భావించిన అమిత్ పంగల్, పూజారాణిలో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారు. మహిళల 79 కిలోల విభాగంలో పతకంపై ఆశలు రేపిన పూజారాణి క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిరారి పట్టింది. చైనా బాక్సర్ లి కియాన్‌తో జరిగిన పోరులో పూజా రాణి పేలవమైన ప్రదర్శన చేసింది. ప్రత్యర్థి ధాటికి ఎదురు నిలువలేక ఘోర పరాజయం పాలైంది. అసాధారణ ఆటతో చెలరేగిన లి 50 తేడాతో పూజాను చిత్తు చేసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక పురుషుల 52 కిలోల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో అమిత్ పంగల్ ఓటమి చవిచూశాడు. కొలంబియా బాక్సర్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత యుబెర్టెన్ మార్టినెజ్‌తో జరిగిన పోరులో 14తో కంగుతిన్నాడు. టోక్యోలో కచ్చితంగా పతకం సాధించి పెడతాడని పంగల్‌పై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ఇప్పటికే మేరీకోమ్ కూడా ఇంటిదారి పట్టింది. అయితే యువ సంచలనం లవ్లీనా మహిళల విభాగంలో సెమీస్‌కు చేరి పతకం ఖాయం చేసింది.
Tokyo Olympics: Puja Rani losses in boxing quarterfinals