టోక్యో: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు టోక్యో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌జెలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో సింధు హాంకాంగ్ క్రీడాకారిణి చెంగ్ ఎంగన్ యిని చిత్తు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు 219, 2116తో జయకేతనం ఎగుర వేసిం ది. తొలి గేమ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. దూకుడుగా ఆడుతూ ముందుకు సాగింది. మరోవైపు చెంగ్ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన భారత స్టార్ అలవోకగా సెట్‌ను సొంతం చేసుకుం ది. అయితే రెండో గేమ్‌లో మాత్రం సింధుకు ప్రత్య ర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. చెంగ్ అద్భు త పోరాట పటిమతో మళ్లీ పైచేయి సాధించేందు కు ప్రయత్నించింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం తీవ్రం శ్రమింంచారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగింది. కానీ కీలక సమయంలో సింధు మళ్లీ పైచేయి సాధించింది. ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి పడేసి లక్షం దిశగా సాగింది.
ఇక తీవ్ర ఒత్తిడికి గురైన చెంగ్ మళ్లీ పొరపాట్లు చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న సింధు 2116తో గేమ్‌ను గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుం ది. తర్వాతి పోరులో సింధు డెన్మార్క్ షట్లర్‌తో మియా బ్లిచ్‌ఫెల్ట్‌తో తలపడుతుంది. అయితే బ్లిచ్‌ఫెల్ట్‌తో పోరు తేలికేం కాదనే చెప్పాలి. సింధు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అసాధారణ ఆటకు మరో పేరుగా చెప్పుకునే బ్లిచ్‌ఫెల్ట్‌ను ఓడించడం సులువేమి కాదని పేర్కొంది. అయితే తాను మాత్రం గెలుపే లక్షంగా ముందుకు సాగుతాన ని సింధు స్పష్టం చేసింది.
సాయి ప్రణీత్ ఔట్
పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ సాయి ప్రణీత్ ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగిన గ్రూప్‌డి రెండో మ్యాచ్‌లో ప్రణీత్ ఓటమి పాలయ్యా డు. నెదర్లాండ్స్ ఆటగాడు మార్క్‌తో జరిగిన పోరు లో ప్రణీత్‌కు పరాజయం ఎదురైంది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో మార్క్ 2114, 2114 తేడా తో ప్రణీత్‌ను చిత్తు చేశాడు. భారీ ఆశలతో ఒలింపిక్స్ బరిలోకి దిగిన ప్రణీత్ కనీసం ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించడం గమనార్హం.
Tokyo Olympics: PV Sindhu reaches pre quarters