Tuesday, November 5, 2024

పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం

- Advertisement -
- Advertisement -

టోక్యో: భారత మహిళల షూటర్ అవని లేఖారా పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. అవని భారత్‌కు తొలి బంగారు పతకం అందించింది. సోమవారం ఉదయం జరిగిన మహిళల షూటింగ్‌ విభాగంలో అవని లేఖారా బంగారు పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవనికి స్వర్ణ పతకం దక్కింది.  దీంతో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళగా అవని లెఖారా చరిత్ర సృష్టించింది. మరోవైపు డిస్కస్ త్రోలో యోగేష్ కతునియా రజత పతకాన్ని సాధించాడు. కాగా, టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు ఒక బంగారు పతకం, మూడు రజత పతకాలు వచ్చాయి.

Tokyo Paralympic: Shooter Avani Lekhara won gold medal

 

Tokyo Paralympic: Shooter Avani Lekhara won gold medal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News