Monday, December 23, 2024

బాలాకోట్ దాడులను ప్రస్థావించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

బగల్ కోట్(కర్నాటక): దేశంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ బాలాకోట్ దాడుల ప్రస్థావన తెరపైకి తెచ్చారు. బాలాకోట్ పై వైమానికి దాడుల గురించి పాకిస్థాన్ కు సమాచారం ఇచ్చిన తర్వాతే మీడియాకు వెల్లడించామన్నారు. కర్నాటకలోని బగల్ కోట్ ఎన్నికల ప్రచారంలో మోడీ ఈ అంశాన్ని ప్రస్థావించారు. 2019 నాటి బాలాకోట్ దాడుల సమాచారాన్ని దాయాది నుంచి దాచిపెట్టలనుకోలేదని తెలిపారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను  జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు బలితీసుకున్న విషయం తెలిసిందే. దానికి ప్రతిగా ఫిబ్రవిర 26న భారత్ వైమానికి దాడులు చేపట్టింది. జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. మళ్ళీ భారత్ పై కన్నెత్తకుండా గట్టి గుణపాఠం ఇచ్చింది. మిగ్ విమానం కూలి మన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ సైనికులకు దొరికిపోయినా, అంతర్జాతీయ ఒత్తిడితో మూడు రోజులకు ఆయనని విడిపించుకోవడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News