Thursday, April 3, 2025

ఒఆర్‌ఆర్ ప్రయాణికులకు చేదువార్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నెహ్రూ ఔటర్‌ రింగు రోడ్డుపై ప్రయాణించేవారికి ఐఆర్‌బి ఇన్‌ఫ్రా సంస్థ చేదువార్తను అందించింది. ఒఆర్ఆర్‌పై టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. కారు, జీపు, వ్యాన్, లైట్ వాహనాలపై కిలోమీటర్‌కు 10 పైసలను పెంచారు. దీంతో కిలోమీటర్‌కి రూ.2.34 ఉన్న ఛార్జీ రూ.2.44కు చేరింది. ఇక మినీబస్, ఎస్‌సివిలకు కిలోమీటర్‌కు ఛార్జీ 20 పైసలు పెరగగా.. కిలోమీటర్‌కి రూ.3.77 ఉన్న ఛార్జీ.. రూ.3.97కు పెరిగింది. 2 యాక్సిల్ బస్సులకు కిలో మీటర్‌కు రూ.6.69 నుంచి రూ.7కు పెంచారు. ఇక భారీ వాహనాలకు కిలోమీటర్‌కు ఛార్జీ రూ.15.09 నుంచి రూ. 15.78కి పెరిగింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News