Sunday, December 22, 2024

20 కి.మీ వరకు టోల్ ఫ్రీ ప్రయాణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రతిరోజూ హైవే లేదా ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రయాణించే వారికి శుభవార్త. ఇకపై గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జిఎన్‌ఎస్‌ఎస్)తో కూడిన వాహనాలకు హైవే లేదా ఎక్స్‌ప్రెస్‌వేపై రోజూ 20 కి.మీ నడిపేందుకు టోల్ ట్యాక్స్ చె ల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు కేంద్ర రోడ్డు రవా ణా, రహదారుల మంత్రిత్వశాఖ మంగళవారం జాతీయ రహదారి టోల్ ఫీ ని బంధనల్లో మార్పులు చేసింది. దీంతో దే శంలో శాటిలైట్ ఆధారిత టోల్ ఫీ వ్య వస్థకు ఆమోదం లభించింది.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, టోల్ ప్లాజా ల వద్ద వాహనాల రద్దీని నివారించేందు కు కొత్త పద్ధతిని తీసుకొచ్చామన్నారు. ఈ సిస్టమ్ కింద టోల్ చెల్లించాల్సిన అ వసరం లేదు. ఈ సదుపాయం టాక్సీ నంబర్లు ఉన్న వాహనాలకు అందుబాటులో ఉండదు.

అయితే ఈ సౌకర్యం ప్రైవే ట్ వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ప్రకారం, ఇప్పుడు టో ల్ వసూలు కోసం గ్లోబల్ నావిగేషన్ శా టిలైట్ సిస్టమ్ (జిఎన్‌ఎస్‌ఎస్), గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జిపిఎస్), ఆన్ బో ర్డ్ యూనిట్లు (ఒబియు) ఉపయోగిస్తా రు. వీటి సాయంతో ఆటోమేటిక్‌గా టో ల్ వసూలు చేయనున్నారు. ఇందులో 20 కి.మీ వరకు ప్రయాణానికి ఎలాంటి రుసుము వసూలు చేయరు. ప్రస్తుతానికి ఫాస్టాగ్ వాడకం కొనసాగుతుంది.

జిఎన్‌ఎస్‌ఎస్‌తో వాహనాలకు ప్రత్యేక లేన్
ప్రస్తుతానికి ఫాస్టాగ్, ఆటోమేటిక్ నంబ ర్ రికగ్నిషన్ టెక్నాలజీ ( ఎఎన్‌పిఆర్) కూడా ఉపయోగించడం కొనసాగుతుం ది. టోల్ ప్లాజాల వద్ద జిఎన్‌ఎన్‌ఎస్, ఒ బియు ఉన్న వాహనాలకు టోల్ వసూ లు కోసం ఆగిపోకుండా ప్రత్యేక లేన్‌లు ఏర్పాటు చేయనున్నారు. అలాంటి వా హనాలు టోల్ రోడ్డును ఉపయోగించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లించాల్సి ఉంటుంది.

దూరం ఆధారంగా టోల్ మినహాయింపు
భారతదేశంలో రిజిస్టర్ కాని, జిఎన్‌ఎస్‌ఎస్ పరికరం లేని వాహనాలకు, టోల్ వసూలు పాత విధానమే కొనసాగుతుందని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఫాస్టాగ్ నుండి డబ్బును తీసివేయడానికి లేదా నగదు చెల్లించడానికి ప్రతి టోల్ ప్లాజా వద్ద ఆగాలి. దీంతో ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. ఇప్పుడు జిపిఎస్ సహాయంతో ప్రయాణించిన దూరాన్ని నిర్ణయించడం ద్వారా టోల్ ఫీ తీసివేస్తారు. దీనివల్ల ప్రజల సమయం కూడా ఆదా అవుతుం ది. రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విధానాన్ని తీసుకురావాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లోని రెండు హైవేలపై పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News