Monday, January 20, 2025

గణేష్ భక్తులకు టోల్‌మాఫీ

- Advertisement -
- Advertisement -

Toll waiver for Ganesh devotees

ముంబై : గణేష్ భక్తులకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వం లోని సంకీర్ణ ప్రభుత్వం గణేష్ ఉత్సవాల కోసం రోడ్డు మీదుగా స్వగ్రామాలకు వెళ్లే భక్తులకు టోల్ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 27 నుంచి ఈ టోల్ ఫ్రీ అమలు లోకి వచ్చింది. ప్రతి సంవత్సరం గణేశోత్సవాలలో పాల్గొనేందుకు ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే వాహనాల సంఖ్య అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ముంబై బెంగళూర్ రహదారి, ముంబై గోవా రహదారులతోపాటు ఇతర పీడబ్లుడీ రోడ్ల మీదుగా వెళ్లే వాహనాలకు ఈనెల 27 నుంచి సెప్టెంబరు 11 వరకు టోల్ మాఫీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి షిండే ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News