Wednesday, January 22, 2025

హోంమంత్రిని ఘాటుగా విమర్శించిన టాలీవుడ్ హీరోయిన్…. అడుక్కుంటే బిక్షం వేస్తాం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: వినాయక మండపాల్లో మైకు పర్మిషన్, విగ్రహం ఎత్తును బట్టి చలాన్లు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత స్పందించారు. ఆంధ్రప్రదేశ్ హిందూ బంధువులు, ముఖ్యంగా వినాయక భక్తుల దగ్గర అడుక్కుంటే భిక్షం వేయడానికి సిద్ధంగా ఉన్నారని,  అసలే గణేషుడికి ఆకలి ఎక్కువ ఆయన కోసం వండే వాటిని తగ్గించి మీ ముఖాన నాలుగు వేస్తారని ఘాటుగా హెచ్చరించారు. అందరికీ హిందూ పండగల మీద చిల్లర ఏరుకోవడమే పనిగా పెట్టుకున్నారని మాధవీలత ధ్వజమెత్తారు. ‘సమాన న్యాయం, సమాన ధర్మం, అన్ని మతాలు సమానం, అన్ని పండగలు సమానం, అందరూ సమానం అంటున్నారు, మరి మా మైక్ సెట్ కు, గణేషా మండపాలకి, వినాయకుడి ఎత్తుకి డబ్బులు ఎందుకు అడుగుతున్నారు?’ అని మాధవీలత ప్రశ్నించారు. మొన్న చిన్నపిల్లని మానభంగం చేసి చంపేశారు… ఏమైంది? అని హోంమంత్రిని అడిగారు. ముసలోడు ఉయ్యాల్లో ఉన్న బిడ్డను మానభంగం చేశాడని, ఆ ముసలోడికి ఉరిశిక్ష వేయరా? అని నిలదీశారు. ఇప్పుడు తామిచ్చే భిక్షతో శిక్షల కోసం న్యాయవాదులను పెడుతారా? అని ఎద్దేవా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News