తమ ఫేవరేట్ స్టార్ హీరో యిన్లను కొత్త సినిమాల్లో చూసి మురిసిపోతారు అభి మానులు. సినిమాల్లో తమ అందచందాలతో ప్రేక్షకులను మైమరపిస్తారు ముద్దుగుమ్మలు. అయితే కొందరు స్టార్ హీరో యిన్లు 2024 సంవత్సరంలో కొత్త తెలుగు సినిమాల్లో కని పించకపోవడంతో వారి అభి మానులు ఎంతో నిరాశచెం దారు. ఏటా తమ అందచందా లతో సినీ ప్రియులను అలరించే పలువురు హీరోయిన్లు.. 2024లో బిగ్ స్క్రీన్ మీద అస్సలు కనిపించలేదు. పలు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, అనుకున్న విధంగా సినిమాలు విడుదల కాకపోవడంతో ఈ సంవత్సరం సందడి చేయలేక పోయారు. అయితే ఈసారి తెరపై కనిపించకపోయినా, 2025లో మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు స్టార్ బ్యూటీలు. కొత్త ఏడాదిలో అలరించడానికి సిద్ధమవుతు న్నారు పలువురు హీరోయిన్లు.
సౌతిండియా స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి గత ఏడాది చివరలో ’మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో హిట్టు కొట్టి ప్రేక్షకులను అలరించింది. ఆమె ఈ ఏడాది ’ఘాటీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నించింది. కానీ కుదరలేదు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా వచ్చే సమ్మర్‌లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు అనుష్క మలయాళ డెబ్యూ మూవీ ’కథనార్: ది వైల్ సోర్సెరర్’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. 2023లో శాకుంతలం, ఖుషి సినిమాలతో సందడి చేసిన అగ్ర కథానాయిక సమంత ఈ ఏడాది బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు.
కాకపోతే ఇటీవల ’సిటాడెల్: హనీబన్నీ’ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో అలరించింది. ఇటీవల తన సొంత ప్రొడక్షన్‌లో ’మా ఇంటి బంగారం’ అనే సినిమాని సమంత ప్రకటించింది. ఈ మూవీ వచ్చే సంవత్సరం విడుదలవుతుందని అభిమానులు భావిస్తున్నారు. వరుసగా సినిమాలు చేసే నయనతారకు కూడా ఈ ఏడాది గ్యాప్ వచ్చింది. కానీ వచ్చే ఏడాది మాత్రం దాదాపు 8 సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంది. కాకపోతే వీటిల్లో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా లేదు. వీటిలో కొన్ని సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసే అవకాశాలున్నాయి. అందాల భామ నిధి అగర్వాల్ తెలుగు తెరపై కనిపించి చాలా కాలమైంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు పవన్‌కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’, ప్రభాస్ ‘ది రాజాసాబ్’లతో ప్రేక్షకులను అలరించనుంది. ఇవి రెండూ వచ్చే వేసవిలో విడుదల కాబోతున్నాయి. ’ఎఫ్ 3’లో స్పెషల్ సాంగ్ లో మెరిసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే.. తెలుగు సినిమా చేసి రెండేళ్లు దాటిపోయింది.
ఈ ఏడాది ఆమె నటించిన సినిమా లేకుండానే గడిచిపోయింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ సూర్య 44, దళపతి 69, దేవాతో సహా నాలుగు చిత్రాలు చేస్తోంది. ‘భోళా శంకర్’ తర్వాత తెలుగు తెరకు దూరమైన మిల్కీ బ్యూటీ తమన్నా.. వచ్చే ఏడాది ’ఓదెల 2’ చిత్రంతో పలకరించనుంది. రెండేళ్ల క్రితం ’థ్యాంక్యూ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రాశీ ఖన్నా.. సమ్మర్ లో ’తెలుసు కదా’ సినిమాతో రాబోతోంది. దీంతో పాటుగా ఆమె చేతిలో రెండు తమిళ, హిందీ చిత్రాలు ఉన్నాయి. ’ది గోట్’ స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసిన త్రిష కృష్ణన్.. వచ్చే ఏడాది హాఫ్ డజన్ సినిమాలతో రానుంది. వాటిల్లో మెగాస్టార్ చిరంజీవితో నటిస్తున్న ’విశ్వంభర’ లాంటి బిగ్ తెలుగు ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇలా పలువురు అందాల భామలు 2025లో పలు కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.