Saturday, April 5, 2025

నవదీప్‌కు పోలీసుల నోటీసులు, అరెస్టుకు అవకాశం?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి సంచలనం సృష్టిస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు సంబంధం ఉందని పోలీసులు చెప్పడంతో పాటు 23న హాజరుకావాలని నోటీసులివ్వడంతో సినీ పరిశ్రమలోని పలువురు ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. మాదాపూర్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నవదీప్‌కు రేపు అంటే 23న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ పేరును వెల్లడించారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నవదీప్ వెల్లడించాడు. కొంతమంది నైజీరియన్లను పట్టుకోవడంతో వారికి నవదీప్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులకు తెలిసింది. ఇదంతా వారి కాల్ డేటా ద్వారా తెలుసుకున్న పోలీసులు విచారణకు హాజరుకావాలని నవదీప్‌కు నోటీసులు జారీ చేశారు. వీటిని 41ఏ కింద జారీ చేస్తామని చెప్పారు.

అయితే అప్పటికే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ సమయంలో నవదీప్‌ను అరెస్టు చేయవద్దని, అయితే అతడిని విచారించవచ్చని కోర్టు పేర్కొంది. అయితే ఈ కేసులో నవదీప్ ప్రమేయం ఉందని పోలీసులు బలంగా విశ్వసిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నవదీప్‌ను 37వ నిందితుడిగా చేర్చారు. ఇప్పుడు కోర్టు బెయిల్‌ను రద్దు చేయడంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లోని ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌ ఒకటి వీరందరికీ ఉచ్చుగా మారిందని పోలీసులు భావిస్తున్నారు. ఇదే అపార్ట్‌మెంట్‌లో దాదాపు పది లక్షల రూపాయల విలువైన డ్రగ్స్‌ పట్టుబడిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ఫిలిం ఫైనాన్షియర్ కె వెంకటరమణారెడ్డి, ‘డియర్ మేఘా’ చిత్ర దర్శకుడు ఆటం సుశాంత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా నవదీప్ పేరు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. నవదీప్ తన స్నేహితుడితో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే కోర్టు బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు నవదీప్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో 23న నవదీప్‌ను అరెస్ట్ చేసే అవకాశం లేదని కొందరు అంటున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. 2017లో కూడా డ్రగ్స్ కేసులో పలువురు టాలీవుడ్‌ను విచారిస్తున్నప్పుడు అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా నవదీప్‌ను ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు, ఈ డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ లో మరోసారి సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు నవదీప్‌ని విచారిస్తే ఎవరి పేర్లు బయటకు వస్తాయోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News