Monday, December 23, 2024

ప్రేమ పేరుతో మోసం.. సినీ నటుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

Tollywood Actor Priyanth Arrested for rape

హైదరాబాద్: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన కేసులో ఓ సినీ నటుడిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… సినిమాల్లో నటిస్తున్న ప్రియాంత్ రావు ‘కొత్తగా మా ప్రయాణం’ సినిమా హీరో ప్రియాంత్‌కు అదే సినిమాలో నటించిన జూనియర్ ఆర్టిస్టుతో పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన తర్వాత ఆమెకు ప్రియాంత్ ప్రపోజ్ చేశాడు. దీనికి యువతి అంగీకరించడంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగింది. ఈ క్రమంలోనే నిందితుడు యువతిని హైదరాబాద్ శివారులోని ప్రగతి రిసార్ట్‌కు తీసుకుని వెళ్లి వివాహం చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా శ్రీనగర్ కాలనీలోని కార్యాలయానికి తీసుకుని వెళ్లి పలుమార్లు లైంగికంగా వేధించాడని పేర్కొంది. తను గర్భం దాల్చడంతో నిందితుడు తనను కలవడం మానివేశాడని తెలిపింది. అబార్షన్ కోసం మెడిసిన్స్ ఇవ్వడంతో అనార్యోగం పాలయ్యానని, ఈ విషయం బయటికి చెబితే చంపివేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను నిందితుడు కులం పేరుతో దూషించాడని పేర్కొంది. రెండు నెలల క్రితమే పోలీసులు కేసు నమోదు చేయడంతో నిందితుడు పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి పోలీసులు వెతుకుతుండగా బుధవారం పట్టుబడ్డాడు. వెంటనే అరెస్టు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tollywood Actor Priyanth Arrested for rape

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News