Wednesday, January 22, 2025

టాలీవుడ్ కీలక నిర్ణయం.. రేపు సినిమా షూటింగ్స్ బంద్

- Advertisement -
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు అన్ని సినిమాల షూటింగ్స్ కు సెలవు ప్రకటించారు. ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు మరణం పట్ల టాలీవుడ్ సంతాపం తెలిపింది. ఆయన మృతికి నివాళిగా ఆదివారం సినిమా షూటింగ్స్ కు సెలవు ప్రకటిస్తూ చలనచిత్ర నిర్మాతల మండలి పిలుపునిచ్చింది. రామోజీరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది హీరోలు, నటులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలియాజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News