Monday, January 20, 2025

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ..

- Advertisement -
- Advertisement -

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని టాలీవుడ్ సినీ ప్రముఖులు కలిశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంకట్ రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని పలు సమస్యలపై చర్చించినట్లు తెలస్తోంది.

మంత్రిని కలిసిన వారిలో సినీ పెద్దలు, అగ్ర నిర్మాతలైన దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు, సురేష్ బాబు, దిల్ రాజు, సి కళ్యాణ్, నట్టి కుమార్, సుధాకర్ రెడ్డితోపాటు పలువురు ఉన్నారు. అలాగే, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలువనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News