Sunday, December 22, 2024

అందాలు అదరహో..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ అద్భుతమైన డ్రెస్ వేసుకుని అందాలు ఆరబోసింది. ముఖ్యంగా ముత్యాలు పొదిగిన డ్రెస్‌లో ముద్దుగా రెడీ అయి డైమండ్ లా మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రగ్యా జైస్వాల్ 2014లో టిట్టూ ఎంబీఏ చిత్రం ద్వారా హిందీ చిత్ర సీమలో అడుగు పెట్టింది. అదే ఏడాది డేగ సినిమాతో తెలుగు సినీ రంగంలోనూ కనిపించి మెప్పించింది. ఆ తర్వాత మిర్చిలాంటి కుర్రాడు, కంచె సనిమాల్లో నటించి మంచి క్రెడిట్‌ను సంపాదించుకుంది.

ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర, సైరా, అఖండ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది. ఓవైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా అద్భుతమైన ఫొటోలు షేర్ చేసింది. ముఖ్యంగా ముత్యాలు పొదిగిన డ్రెస్ లో ముద్దబంతిలా మెరిసిపోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News