Wednesday, December 25, 2024

టాలీవుడ్ డ్రగ్స్ కేసుల కొట్టివేత

- Advertisement -
- Advertisement -

12కేసుల్లో ఆరు కేసులను కొట్టివేసిన నాంపల్లి కోర్టు
తగిన సాక్షాధారాలు లేవని నిర్ధారణ

తరుణ్, పూరీ జగన్నాధ్‌కు ఊరట

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 2018లో నమో దైన కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏ ర్పాటు చేసింది. మొత్తం 12 కేసులు నమోదు చేసి సిట్ ఎనిమిది కేసుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. వీటిలో ఆరు కేసులకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో నాంపల్లి కోర్టు కొట్టివేసింది. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ పాటించలేదని, ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులకు సంబంధించి నెలల తరబడి టాలీవుడ్ నటులను ఎక్సైజ్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసు కొట్టివేతతో సినీ ప్రముఖులు తరుణ్, పూరీ జగన్నాధ్‌కు ఊరట లభించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News