Saturday, November 23, 2024

టాలీవుడ్ ‘డ్రగ్స్’పై హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

Tollywood Drugs Case

హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి 2017లో రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై బుధవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇడికి సహకరించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి వాదించారు. కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదని రచనారెడ్డి పేర్కొన్నారు. ఆన్‌లైన్ విచారణలో డ్రగ్స్ కేసులో డాక్యుమెంట్లను ఎక్సైజ్ శాఖ వివరాలను ఇవ్వడం లేదని కోర్టుకు ఇడి జెడి అభిషేక్ గోయల్ వివరించారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన సమాచారమంతా ఇడికి, కోర్టులకు ఇచ్చామని ప్రభుత్వ ప్రత్యేక జిపి పేర్కొన్నారు. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎఫ్‌ఐఆర్‌లు, ఇతర పూర్తి వివరాలు ఇడికి అప్పగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అదేవిధంగా దర్యాప్తు అధికారులు సమర్పించిన రికార్డులను సైతం ఇడికి ఇవ్వాలని ఆదేశించింది. ఇడి దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో వివరాలు ఇవ్వాలని విచారణ కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వారి కాల్ డేటా రికార్డులను నెల రోజుల్లో ఇడి కి ఇవ్వాలని ఆదేశించింది.డ్రగ్స్ యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ద్రేశ ప్రయోజనాల కోసం టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం ఇడి దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు తెలిపింది. తమ ఆదేశాలను అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఈక్రమంలో డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి పిల్‌పై విచారణ ముగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News