మనతెలంగాణ/హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇడి బుధవారం నాడు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. ఈక్రమంలో సిఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని పిటిషన్‌లో ఇడి కోరింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇడి వివరాలను ఇవ్వాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసులోని నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్‌శాఖకు ఇడి లేఖ రాసింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని ఇడి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు లేనందున కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఇడి పేర్కొంటూ సిఎస్, ఎక్సైజ్ డైరెక్టర్‌కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు పంపింది.
Tollywood Drugs Case: ED Petition against CS Somesh Kumar