Monday, January 20, 2025

టిడిపిలో చేరిన టాలీవుడ్ హీరో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ హీరో నిఖిల్ తెలుగు సినిమాలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. పాన్ ఇండియా లెవల్ సినిమాలు చేస్తూ నిఖిల్ బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో సామాజిక, రాజకీయ అంశాలపై అప్పుడప్పుడు పోస్టులు పెట్టడంతో పాటు స్పందిస్తాడు. ఆ పోస్టులపై అభిమానులు కామెంట్లు చేయడంతో వైరల్‌గా మారాయి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో నిఖిల్ ఆ పార్టీలో చేరారు. నారా లోకేశ్ ఆయనకు టిడిపి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. రాజకీయ అంశాలపై సోషల్ మీడియాలో స్పందించడంతో పొలిటికల్ లైన్ తీసుకుంటాడని గతంలో కామెంట్లు వచ్చాయి. ఆయన ఎప్పుడు ఆ కామెంట్లకు బదులు ఇవ్వలేదు. ఆయన తాజాగా టిడిపిలో చేరడంతో హాట్ టాఫిక్‌గా మారింది. ఎపి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే టిడిపి అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో నిఖిల్ టిడిపి తరఫున ఎపిలో ప్రచారం చేస్తారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News