Wednesday, January 22, 2025

సిఎం జగన్‌తో భేటీ కానున్న టాలీవుడ్ హీరోలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను మెగాస్టార్ చిరంజీవితోపాటు నాగార్జున, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, ప్రభాస్, పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు కలవనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు సిఎం జగన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి 9గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు.

కాగా, ఈ సమావేశంలో సినిమా టికెట్ల ధరలు, చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం సాయం, ఇతర అంశాలపై చర్చించనున్నారు.ఈ సమావేశానికి మంత్రి పేర్ని నానితోపాటు ఎపి ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Tollywood Heroes to meet AP CM Jagan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News