Wednesday, January 22, 2025

ఆర్యగానే స్వీట్ మెమొరీగా నిలిచిపోతావు

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇక శనివారం తన 41వ బర్త్ డే జరుపుకున్న అల్లు అర్జున్‌కి పలువురు ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ప్రత్యేకం గా బర్త్ డే విషెస్ ని తెలియజేశారు.

కాగా తన అభిమాన స్టైలిష్ స్టార్ కి దర్శకుడు సుకుమార్ తన సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా సూపర్‌గా బర్త్ డే విషెస్‌ని తెలియజేశారు. “పుట్టిన రోజు శుభాకాంక్షలు బన్నీ, ప్రస్తు తం పుష్పరాజ్‌గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ మెప్పుతో నువ్వు దూసుకెళ్తూ ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. కానీ నాకు మాత్రం నువ్వు నా ఆర్యగానే ఎప్పటికీ మదిలో స్వీట్ మెమొరీగా నిలిచిపోతావు’అంటూ పుష్ప 2 సినిమా సెట్స్‌లోని ఒక పిక్‌ని జత చేశారు సుకుమార్. కాగా సుకుమార్ పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News