Friday, December 27, 2024

సెలబ్రిటీలకు డ్రగ్స్ .. హైదరాబాద్‌కు వస్తూ 100 ప్యాకెట్ల కొకైన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి మంగళవారం రాత్రి కిస్మత్ పూర్ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. కృష్ణ ప్రసాద్ చౌదరి నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ అమ్ముతుండగా కె.పి చౌదరిని పట్టుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 82.74 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.

కొకైన్ విక్రయం కేసులో నైజీరియన్ పెటిట్ పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న నైజీరియన్ పై గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కెపి చౌదరి 2016 లో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. కబాలి సినిమాకు తెలుగు నిర్మాతగా వ్యవహరించాడు. కెపి చౌదరి పలు తెలుగు, తమిళ చిత్రాలకు పంపిణీ చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను పంపిణీ చేశాడు.

సినీ రంగంలో నష్టాలతో కెపి చౌదరి డ్రగ్స్ సరఫరాలోకి దిగాడు. ఇందులో బాగంగానే గోవాలో ఓహెచ్ఎం పబ్ ను ప్రారంభించాడు. గోవాకు వచ్చిన సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. పబ్ లో నష్టాలు రావడంతో కెపి చౌదరి తిరిగి హైదరాబాద్ కు వచ్చాడు. గోవా నుంచి వస్తూ 100 ప్యాకెట్ల కొకెన్ తీసుకువచ్చాడు. అందులో కొన్నింటిని అతను వినియోగించాడని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News