Monday, December 23, 2024

సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Tollywood senior director sarath passed away

హైదరాబాద్: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీనియర్ దర్శకుడు శరత్ శుక్రవారం కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో క్యాన్సర్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, వంశోద్ధారకుడు, సుల్తాన్, సూపర్ మొగుడు, బంధువులొస్తున్నారు జాగ్రత్త వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. చాదస్తపు మొగుడు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన తెలుగులో సుమారు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. శరత్ మరణవార్త విన్న పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో శరత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News