Friday, December 20, 2024

హిట్‌తో మొదలుపెట్టి.. ఫ్లాప్‌తో కనుమరుగైన దర్శకులు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: సినిమా రంగం పరమపద సోపాన పటం లాంటింది. పైపైకి తీసుకెళ్లే నిచ్చెనలే కాందు కిందకు లాగేసే పాములు కూడా ఉంటాయి. చిత్ర పరిశ్రమ కూడా వైకుంఠపాళి లాంటిందే. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ నిర్మాతల చుటూ చక్కర్లు కొట్టే కుర్ర దర్శకులు ఆ తర్వాత అగ్రదర్శకులైపోవడం.. ఒక్క ఫ్లాప్‌తో కనుమరుగైపోవడం.. ఇక్కడ మామూలే.
మొదటి సినిమాలో తమ టాలెంట్ చూపించి హిట్ కొట్టిన దర్శకులు కొందరు అగ్ర హీరోల దృష్టిలో పడి అగ్రస్థానానికి చేరుకుని ఆ తర్వాత ఒకే ఒక్క ఫ్లాప్‌తో తెరమరుగైపోయారు. అటువంటి దర్శకుల కోవలోకే శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, విజయ భాస్కర్, కరుణాకరన్, మేర్లపాక గాంధీ, బొమ్మరిల్లు భాస్కర్ వస్తారు.

Also read: బిజెపి హఠావో, దేశ్ బచావో!

శ్రీనువైట్ల విషయానికి వద్దాం.. ఆయన దర్శకుడిగా పరిచయమైన చిత్రం నీకోసం. రవి తేజ అప్పుడప్పుడే హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న రోజులు. చిన్న చిత్రమే అయినా శ్రీను వైట్లకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన ఆనందం చిత్రం హిట్ కావడంతో శ్రీను వైట్ల కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత వరుసగా రవి తేజతో వెంకీ, దుబాయ్ శ్రీను, ఢీ, రెడీ, కింగ్, నమో వెంకటేశ, దూకుడు వంటి చిత్రాలు శ్రీను వైట్లను స్టార్ డైరెక్టర్‌గా మార్చేశాయి. ఆ తర్వాత వచ్చిన బాద్షా కూడా ఫర్వాలేదనిపించుకున్నా ఆగడు చిత్రంతో శ్రీను వైట్ల సక్సెస్ యాత్రకు బ్రేక్ పడింది. బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంథోని చిత్రాలు పరాజయం చెందడంతో శ్రీను వైట్ల గుంరించి తలచుకునే వారే లేకపోయారు.

శ్రీకాంత్ అడ్డాలదీ దాదాపు ఇదే పరిస్థితి. కొత్త బంగారు లోకంతో దర్శకుడిగా తన సత్తా చూపించిన శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత మహేష్‌బాబు, వెంకటేష్‌తో తీసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో అగ్రదర్శకుల జాబితాలో చేరే అవకాశం సంపాదించుకున్నారు. మరుసటి చిత్రం ముకుంద ఫర్వాలేదనిపించుకుంది. మహేష్‌బాబు మరో అవకాశం ఇచ్చినప్పటికీ బ్రహ్మోత్సవం డిజాస్టర్ కావడంతో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ గ్రాఫ్ దెబ్బతింది. ఆ తర్వాత వచ్చిన నారప్పతో శ్రీకాంత్ అడ్డాల ఊసే లేకుండా పోయారు.

Also read: నా జీవితంలోనూ బ్రేకప్ జరిగింది.. అందుకే..

దర్శకుడిగా విజయ భాస్కర్ వెంకటేష్, నాగార్జునకు వారి కెరీర్ బెస్ట్ చిత్రాలనే ఇచ్చారు. దర్శకుడిగా విజయభాస్క

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News