Monday, December 23, 2024

తండ్రి కాబోతున్న యంగ్ హీరో నిఖిల్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హ్యాపీడేస్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నిఖిల్ పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. 2020లో నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్నారు.ఇటివల నిఖిల్ , తన భార్య పల్లవితో కలిసి ఓ ఫ్యామిలీ ఈవెంట్ కు వెళ్లగా అక్కడ ఆమె బేబీ బంప్ తో కనిపించారని తెలుస్తోంది. నిఖిల్ భార్య పల్లవి గర్భవతి అంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై నిఖిల్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ‘స్వయంభు’ చిత్రం షూటింగ్ లో నిఖిల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే అత్తంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News