Wednesday, January 22, 2025

‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’నుంచి ‘టామ్ అండ్ జెర్రీ’ లిరిక్ సాంగ్ రిలీజ్

- Advertisement -
- Advertisement -

‘చిట ప‌టమ‌ని క‌సిరితే
గుస‌గుస‌మ‌ని న‌సిగితే
పొగ‌రంతా క‌రిగేలా ర్యాంపాడిస్తా’ అని అబ్బాయి అమ్మాయిపై చిటపట మంటున్నాడు..

ఇక అమ్మాయి ఊరుకుంటుందా?

‘తల బిరుసుతో ఎగిరితే
మ‌గ బ‌లుపిక ముదిరితే
మొహ‌మాటం ప‌డ‌కుండా ర‌ఫాడిస్తా’ అంటూ ర‌ఫ్‌గా స‌మాధానం ఇస్తుందమ్మాయి.

ఇలా అబ్బాయి.. అమ్మాయి మాట‌ల‌తో కాదండోయ్ ఏకంగా పాట‌ల‌తోనే గొడ‌వ‌లు ప‌డుతున్నారు. అస‌లు వీళ్ల గొడ‌వ‌కి కార‌ణ‌మేంటో తెలుసుకోవాలంటే మాత్రం ఫిబ్ర‌వ‌రి 18న రిలీజ్ అవుతున్న ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా చూడాల్సిందేనంటున్నారు గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత‌లు విష్ణు ప్రసాద్‌, సుస్మిత కొణిదెల‌.

ఇంత‌కీ శ్రీదేవి ఎవ‌రు.. శోభ‌న్‌బాబు ఎవ‌రు? వారి మ‌ధ్య గొడ‌వేంది? అనేది తెలియాలంటే త‌ప్ప‌కుండా సినిమా చూడాల్సిందేనండోయ్‌. శోభ‌న్‌బాబుగా సంతోష్ శోభ‌న్‌.. శ్రీదేవిగా గౌరి జి కిష‌న్ న‌టించిన చిత్రం ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని సుస్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే మూవీ ప్ర‌మోష‌న్స్ ఫుల్ స్వింగులో ఉన్నాయి. అందులో భాగంగా శుక్ర‌వారం చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ‘టామ్ అండ్ జెర్రీ’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. క‌మ్రాన్ సంగీతంలో కిట్టు విస్సాప్ర‌గ‌డ రాసిన ఈ పాట‌ను రేవంత్‌, సింధుజ శ్రీనివాస‌న్ పాడారు. ఈ సంద‌ర్భంగా…

నిర్మాతలు సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ మాట్లాడుతూ ‘‘‘శ్రీదేవి శోభ‌న్‌బాబు ‘‘నా మనసుకు ఎంతో ద‌గ్గ‌రైన సినిమా. ఈ సినిమా కోసం అంద‌రం మ‌న‌సు పెట్టి ప‌ని చేశాం. మా అంద‌రిలోని ఇన్నోసెంట్ ఎమోష‌న్స్ అన్నీ స్క్రిప్ట్‌కి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యింది. సంతోష్ శోభన్, గౌరిలు పాత్రల్లో ఒదిగిపోయారు. వారి క్యారెక్టర్ష్ ఎలా ఉంటాయనే దాన్ని ఈ టామ్ అండ్ జెర్రీ పాట రూపంలో తెలియజేస్తున్నాం. క‌మ్రాన్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఫన్నీగా ఉంటూనే ఎమోషనల్‌గా మ‌న‌కు కనెక్ట్ అవుతుంది. మన పక్కన ఇంటిలో జరిగేలాంటి నెటివిటీ ఉన్న కథతో ప్రశాంత్ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్ర‌వ‌రి 18న మీ ద‌గ్గ‌రున్న థియేట‌ర్స్‌లో ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’ సినిమా వస్తుంది’’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News