Friday, December 20, 2024

జి20దేశాలకు కేంద్రమంత్రి తోమర్ పిలుపు

- Advertisement -
- Advertisement -
వ్యవ‘సాయం’చేసుకుందాం
విపత్తుల సవాళ్లు అధిగమిద్దాం

హైదరాబాద్: వ్యవసాయరంగంలో సుస్థిరతను సాధించేందకు కలిసి పనిచేద్దాం..ప్రకృతి సవాళ్లను ఎదుర్కొందాం అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ జి20సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా గురువారం జి20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం ప్రారంభమైంది. మాదాపూర్ హెచ్‌ఐసిసిలో మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలను కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి లాంఛనంగా ప్రారంభించారు. భారత్ తోపాటు జి20సభ్య దేశాలనుంచి పలువురు వ్యవసాయ శాఖల మంత్రులు , అంతర్జాతీయ పరిశోధనల సంస్థలకు చెందిన ప్రతినిధులు , శాస్త్రవేత్తలు ,నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జి20 ప్రారంభ సమావేశాలను ఉద్దేసిం,ఇ కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయరంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరైన పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కృషిలో భాగంగా జి20దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్దంగా ఉందన్నారు. హైదరాబాద్ వేదికగా జి20దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.ఈ కీలక సమావేశాలు మూడు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. అనూహ్య వాతావరణ మార్పుల నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి భారత్‌లో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలు , సవాళ్లు వాటి పరిష్కారాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నట్టు తెలిపారు. పెరుగుతున్న జనాభా దృష్టా ఆహార భద్రత , పోషకాహార భద్రతపై చర్చలు జరుతుపుతన్నట్టు వెల్లడించారు.
వ్యవసాయం ,ఉద్యాన పంటల ఉత్పత్తి ,ఉత్పాదక పెంపుదల తదితర అంశాలపైన చర్చలు జరుగుతున్నాయని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి నేతృత్వంలో అన్నదాతల ఆదాయాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందనితెలిపారు. ప్రత్యేకించి సన్న చిన్నకారు రైతులను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. దేశంలో సేంద్రీయ , సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని , సేంద్రీయ రైతులు తమ ఉత్పత్తుఉ అమ్ముకోవడానికి మార్కెటింగ్ లింకేజి కల్పించినట్టు కేంద్ర మంత్రి తోమర్ తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసి వ్యవసాయ ప్రదర్శనకు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి ప్రారంభోత్సవం చేశారు. వ్యవసాయం , అనుబంధ రంగాల్లో భారత్ సాదించిన విజయాలను ప్రదర్శించేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News